వికారాబాద్, జులై 23 (ఆంధ్రప్రభ): వానకాలం 2025కి వికారాబాద్ (Vikarabad) జిల్లాలో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజరత్నం (Raja Ratnam) తెలిపారు. జిల్లా యూరియా సరఫరాలను నిశితంగా పర్యవేక్షిస్తుందని, అన్ని ఎరువుల దుకాణాల్లో ఎల్లప్పుడూ నిల్వ ఉండేలా చూస్తుందని ఆయన తెలిపారు. ప్రైవేట్ దుకాణాలు (Private shops), సొసైటీలు (Societies), మార్కుఫెడ్ గోడౌన్ (Markufed Godown) లలో తగినంత యూరియా నిల్వలు ఉన్నందున రైతులు భయపడవద్దని తెలిపారు. యూరియా కొరత గురించి ఎలాంటి పుకార్ల నునమ్మవద్దని రైతులను కోరారు.
1.ప్రతి ఎరువుల దుకాణ దారులు రేపటి నుండి యూరియా లభ్యత, అమ్మకాలు, నిల్వల వివరాలు ప్రదర్శించాలి.
2.డీలర్లు రైతుల పట్టాదారు పాసు పుస్తకం సంఖ్య, విస్తీర్ణం, కొనుగోలు చేసిన సంచుల సంఖ్య రికార్డ్ ను నిర్వహించాలి.
3.ఎంఎఓ లు, ఎఇఓ లు యూరియా లభ్యతపై రైతులకు అవగాహన కల్పించాలి.
4.ఫ్లెక్సీ ప్రదర్శన, రికార్థుల ఫోటోలను పోస్ట్ చేయాలి.
రైతులు సన్న యూరియాకు బదులు దొడ్డు యూరియాను వాడాలి. సన్న యూరియా త్వరగా నీటిలో కరిగి పోషకాలు నేలలోని పొరలోకి పోయి మొక్కలకు అందదని, దొడ్డు యూరియా నీటిలో నెమ్మదిగా కరిగి మొక్కకు అందుబాటులోకి వస్తుందని, వ్యవసాయ శాఖ అధికారి రాజరత్నం తెలిపారు.