MDK | ఫార్మా కంపెనీలో దొంగతనం.. అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

సంగారెడ్డి, ఫిబ్రవరి 20 (ఆంధ్రప్రభ) : ఫార్మా కంపెనీల్లో పల్లాడియం కార్బన్ దొంగతనం చేసిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. గురువారం సదాశివపేట పోలీసు స్టేషన్ పరిధిలో యావాపూర్ గ్రామంలో గల అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్-3 కంపెనీలో జరిగిన పల్లాడియం కార్బన్ దొంగతనం గురించి అరీన్ లైఫ్ సైన్సెస్ సీనియర్ హెచ్ ఆర్ మేనేజర్ మజ్జి సూరప్పల నాయుడు ఫిర్యాదు మేరకు సదాశివపేట పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి, ఈ కేసు ఛేదించడానికి ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా సిసియస్, సదాశివపేట పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

దర్యాప్తు ప్రారంభించగా నూతన సాంకేతికత, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని మద్దికుంట చౌరస్తాలో ఆరుగురు నేరస్థులను పట్టుకొని, వారి వద్ద నుండి దొంగిలించబడిన 96 కిలోల పల్లాడియం కార్బన్ ను స్వాధీన పరుచుకోవడం జరిగింది. ఈ కంపెనీకి వచ్చి స్టోర్ మేనేజర్ అయిన ముక్కంటి రెడ్డిని కలిసి అతనికి డబ్బుల ఆశ చూపి మెటీరియల్ పూర్తి వివరాలు తెలుసుకొని ప్రసాద్ కు చెప్పగా, అతని గ్యాంగ్ సభ్యులు ఏ-2 to ఏ-8 కంపెనీ నుండి సుమారు 120కిలోలు పల్లాడియం కార్బన్ దొంగలించినట్లు విచారణలో తేలింది. దీని విలువ మొత్తం సుమరు 4.5 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ కేసు చేదనలో కృషిచేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ సిహెచ్ రూపేష్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *