ప|| జోలాలిపాపగా జోగులాంబగా
ఆలంపూరులో వెలసితివి
మా జోలాలిపాపకు నీరాజనం.
అను|| చిరునవ్వు నవ్వుతూ చిత్ర జగత్తుకూ
చిన్నారిపాపగా జగత్కారిణికీ నీరాజనం
చ|| అద్భుత శక్తిగా చిన్నారి పాపగా జగమంతా
పాలించే అమృతమూర్తిగా కోర్కెలను తీర్చే
కరుణామయిగా సౌభాగ్యములనిచ్చే
జోలాలిపాపకూ జోగులాంబకు నీరాజనం