పల్లె జనం నిత్యం వామ్మో ,, వాయ్యో
- పాముల సయ్యాట
కేవీబీ పురం తిరుపతి జిల్లా, ఆంధ్రప్రభ : తుంపరి జల్లుల్లో పుడమి తల్లి పరవశించిపోతే.. భూమికి(to earth) పచ్చని రంగేసినట్టు.. తంగెడు పొదలు సహా పిచ్చిమొక్కలు అల్లుకు పోవటం సహజం. కన్నుల విందు చేసే ఈ పకృతి(to nature) మాత సౌందర్యం మరపురాదు. కానీ.. ఈ కమనీయ దృశ్యమాలికే ఓ మృత్యు కుహరమంటే.. వామ్మో అని జనం వీపులు చరచుకుంటారు.
గుండెలు బాదుకుంటారు. అపునండీ.. ఇది నిజం. పల్లెలో ఎటు చూసినా ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు. తరలి వచ్చిన వనం(forest)లా కనిపిస్తాయి. కానీ అది అడవి కాదు. జనారణ్యం. రాత్రి పూట ఇంటిని వదిలి బయట అడుగు వేయాలంటేనే వణుకు తప్పదు. పిచ్చి మొక్కల పొదల్లో(to the bushes of plants) విష సర్పాల సయ్యాటలాడుతూ.. జనజీవనంలోకి మమేకమవుతాయి.
ఈ తంతు తిరుపతి జిల్లా కేవీ.పురం మండలంలో ఏ గ్రామంలో చూసినా.. వామ్మో పాము.. వాయ్యో పాము(snake) అని జనం అరుపులు వినిపిస్తాయి. సత్యవేడు నియోజకవర్గంలోనే 39 పంచాయతీలు 67కు గ్రామాలు కలిగిన విశాల మండలం కేవీబీ పురం(KVB Puram). ఈ మండలంలో ప్రజలు నివసిస్తున్ననివాసాలు, ఖాళీ ప్రదేశాల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో నివాసాలు నడుమ విష సర్పాలకు స్థావరాలుగా మారి స్థానికులను భయాందోళన(in the bushes) గురిచేస్తోంది.
స్థానికులు పిచ్చిమొక్కలు(crazy plants) తొలగించేందుకు గడ్డి మందులు, ఇతర రసాయనిక మందులను వినియోగిస్తున్నప్పటికీ పిచ్చి మొక్కలు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది.
- వీధులనూ వీడని పిచ్చి మొక్కలు…
ఎన్నోసంవత్సరాల తరబడి గ్రామాలుగా ఏర్పడి స్థానికులు నివాసముంటున్న ప్రదేశాలను కాకుండా నిత్యం ప్రజలు తిరగాడే వీధుల్లోనూ పిచ్చిమొక్కలు లేపుగా పెరిగి స్థానికులను కలవరపెడుతోంది. ఇవి వీదు లేనా అన్నఅనుమానం కొత్త వ్యక్తులకు వచ్చేలా వీధుల్లో ఈ పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడం వల్ల స్థానికులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ సమస్యను అధికారులు(officials) దృష్టికి తీసుకెళుతున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు చేతులు ఎత్తివేయడంతో సమస్య గత రెండు నెలలుగా తీవ్ర రూపం దాల్చుతోంది.
- దోమల మోత మామూలే
పిచ్చి మొక్కలు స్థానికంగా ఏపుగా పెరగటం వల్ల విష సర్పాలే కాకుండా దోమలు బెడద అధికంగా మారుతుంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా దోమలు అధికంగా ఉండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో దోమకాటు(mosquito bites) వలన పలువురు విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు క్యూ కడుతున్నారు.
అంతేకాకుండా పలువురు పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు(private hospitals) వెళ్లి ఆరోగ్య సమస్యలపై అక్కడ వైద్యాధికారులతో మొరపెట్టుకుంటున్నారు. కనీసం గ్రామాలలో దోమల నివారణకు ఎలాంటి ముందస్తు చర్యలను పంచాయితీ అధికారులు తీసుకుపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు.
- తగు చర్యలు తీసుకుంటాం : ఇన్ చార్జి ఎంపీడీవో తరుణాక్ష రెడ్డి
మండలంలో పలు గ్రామాల్లో పిచ్చిమొక్కల సమస్య నివారణకు పంచాయతీ(Panchayat) కార్యదర్శులతో ఇది వరకే సమీక్ష నిర్వహించి పిచ్చి మొక్కల తొలగింపుకు చర్యలు తీసుకుంటున్నాం. దోమల నివారణ కూడా శానిటేషన్ పనులను చేయించేలా స్థానిక సర్పంచులతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం.

