హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. హెచ్‌సీయూలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలింది. కూలిన భవనం శిథిలాల కింద… అక్కడే పనిచేస్తున్న పలువురు కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.
వెంటనే స్పందించిన తోటి కార్మికులు, సిబ్బంది వారిని బయటకు తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన కార్మికులను ఆస్పత్రికి తరలించారు.
శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉంటారా పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని హెచ్‌సీయూ అధికారులు తెలిపారు.