సేవలు అందక బాధితుల ఆవేదన

  • 10 రోజుల క్రితం108 వాహనం బ్రేక్ డౌన్..
  • మరమ్మత్తుల చర్యలు శూన్యం

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి(Kammer Palli) మండలంలో అత్యవసర సేవల కోసం వినియోగించుకునే 108 సేవల వాహనం పాడైంది. గ‌త 10 రోజుల క్రితం నుంచి కమ్మర్ పల్లి మండలంలో 108 సేవలు నిలిచిపోయాయి. ఆపద వస్తె అత్యవసర సేవల కోసం ప్రైవేట్ వాహనాలను భాదితులు ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందనీ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద బాధితులతో పాటు గ్రామాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, పాము కాటు, కుక్కలు, కోతుల దాడికి గురైనా బాధితులను, గర్భిణుల సేవలు ఆస్పత్రి(Hospital)లో చికిత్స పొందేలా 108 అత్యవసర వాహనంలో తీసుకెళ్తుంటారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో అత్యవసర సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

108 వాహనం బ్రేక్ డౌన్(break down).. అయి 10 రోజులు దాటుతున్నా వాహనాన్ని ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల మరమ్మతులు చేయించకపోవడం ఏమిటని.. మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 108 వాహనం బ్రేక్ డౌన్ అవడంతో మోర్తాడ్ మండలం నుంచి అంబులెన్స్ వచ్చేవరకు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. 10 రోజులు దాటినా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. అధికారులు వెంటనే స్పందించి 108 వాహనం త్వరగా రిపేర్(Repair) చేయించి అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

  • జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రామలింగేశ్వర్ రెడ్డి

కమ్మర్ పల్లి మండల 108 అంబులెన్స్ వాహనం గత 10 రోజుల క్రితం బ్రేక్ డౌన్(Break Down) కాగా మరమ్మతులు చేయించలేదు. ఈ విషయమై నిజామాబాద్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ రామలింగేశ్వర్ రెడ్డినీ ఆంధ్ర ప్రభ విలేఖరి వివరణ కోరగా.. కమ్మర్ పల్లి మండల 108 వాహనం మరమ్మత్తులు చేయించడానికి అనుమతి తీసుకున్నామని, సోమవారం హైదారాబాద్‌(Monday, Hyderabad)కు మరమ్మత్తుల నిమిత్తం తరలిస్తామని చెప్పారు. మరమ్మత్తులు పూర్తికాగానే 108 సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

Leave a Reply