ఆంధ్రప్రభ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్ వ్యూ
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. ఇంకా ఉన్నత స్థాయికి వెళతారు అనుకుంటే.. ఊహించని విధంగా ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అందుకనే జూబ్లీహిల్స్ నియోకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న త్రిముఖ పోటీలో ఆరోపణలు ప్రత్యారోపణలతో పోటీ రసవత్తరంగా మారింది.
తెలంగాణ ఇచ్చింది మేమే అని కాంగ్రెస్ అంటుంటే.. అసలు తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే అని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రజలు బీజేపీ ఎంపీలుగా గెలిపిస్తే వాళ్లు పార్లమెంట్ కు వెళ్లి సాధించింది శూన్యమని బీఆర్ఎస్ నాయకుడు పోలపల్లి రామ్మూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. పొలపల్లితో ఆంధ్రప్రభ జరిపిన ఎక్స్ క్లూజీవ్ ఇంటర్ వ్యూ.. ఆయన వెలువరిచిన మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.