The Raja Saab | బొమన్ ఇరానీ క్యారెక్టర్ ఏంటి..?

The Raja Saab | బొమన్ ఇరానీ క్యారెక్టర్ ఏంటి..?

The Raja Saab, ఆంధ్రప్రభ వెడ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్, (Prabhas) టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ రాజా సాబ్. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు వెర్సటైల్ యాక్టర్ బొమన్ ఇరానీ. గత కొన్ని రోజులుగా ఈ వార్త సస్పెన్స్ గానే ఉంచారు. అయితే.. ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడంతో క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాలో బొమన్ ఇరానీ క్యారెక్టర్ ఏంటంటే… సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నారని సమాచారం.

The Raja Saab| రాజా సాబ్ ను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు

The Raja Saab

సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న రాజా సాబ్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హార్రర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా రాజా సాబ్ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి (Director Maruthi). ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఇటీవల రిలీజ్ చేసిన రాజా సాబ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ రెబల్ సాబ్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రాజా సాబ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు రాజా సాబ్ ను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. మరి.. రాజాసాబ్ తో.. డార్లింగ్ ప్రభాస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.

Click Here To Read ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌.

Click Here To Read More

Leave a Reply