చిత్తూరు, (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు(Chittoor)లో గంజాయి, డ్రగ్స్(Drugs) మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుతానని నూతన ఎస్పీ తుషార్ డూడి(SP Tushar Dudi) వెల్లడించారు. చిత్తూరు జిల్లా 68వ ఎస్పీగా తుషార్ డూడి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం(Monday) బాధ్యతలు స్వీకరించారు. 2018 వ బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ తుషార్ డూడి. ఆయన గతంలో గ్రే హాండ్స్ విభాగంలో అసాల్ట్ కమాండెంట్ గా, చింతపల్లి(Chitapalli) అదనపు ఎస్పీగా, అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju) జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా, వై.ఎస్. ఆర్ కడప జిల్లా, గుంటూరు అర్బన్(Guntur Urban), గుంటూరు, ఎస్పీగా విధులు నిర్వహించారు.
పోలీసుల్లో వృత్తి నైపుణ్యత పెంచుతాం
బాపట్ల జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించారు. పదవీ భాద్యతలు తీసుకున్న అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), డీజీపీ హరీష్ కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta)కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మాదక ద్రవ్య రహిత జిల్లా లక్ష్యం
మహిళలు, బాలికల రక్షణే ద్యేయంగా మొదటి కర్తవ్యంగా పని చేస్తానని ఆమె ఇచ్చారు. జిల్లా అంతటా గంజాయి, డ్రగ్స్(Drugs) వంటి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్ములించడానికి కృషి చేస్తానని వెల్లడించారు. జిల్లా పోలీసులలో వృత్తి నైపుణ్యత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రజల పట్ల పోలీసులపై నమ్మకాన్ని పెంచుతూ ప్రజలకు దగ్గర అయ్యేలా చేస్తామని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ ను బలపరుస్తామని ఈ సందర్బముగా ఎస్పీ తెలియజేసారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులు నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.

