నాలుగో తరగతి ఉద్యోగుల..
నూతన ఐటి డిఏ పిఓ యువరాజ్ మర్మట్ కు సన్మానం
ఉట్నూర్, నవంబర్ 4, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ నూతన పీఓగా యువరాజు మర్మాట్ (Yuvaraju Marmat) నియామకం కావడంతో ఆయనకు మంగళవారం తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ ఆధ్వర్యంలో సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన పీఓ యువరాజ్ మర్మాట్ శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా నూతన పీఓ (new PO) దృష్టికి నాలుగో తరగతి ఉద్యోగుల, డైలీ వేజ్ సానిటేషన్ పార్ట్ టైం వర్కర్ల సమస్యలు వివరించినట్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ (KBC Narayana) తెలిపారు. నూతన స్పందించి త్వరలోనే మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో నాలుగో తరగతి ఉద్యోగుల ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు రామచందర్, సోనేరావు, సంఘ నాయకులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.

