దోపిడీ దొంగల బీభత్సం

దోపిడీ దొంగల బీభత్సం

కనకాపూర్ లో బంగారం నగదు చోరీ

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని కనకాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఏ స్సై శ్రావణి తెలిసిన వివరాలు ప్రకారం శుక్రవారం సాయంత్రం కనకపూర్ గ్రామానికి చెందిన షేర్ల రవి అను అతను వారి కుటుంబ సభ్యులంత వారి ఇంటికి తాళం వేసుకొని అత్తగారి ఇల్లు తాండ్రా గ్రామానికి వెళ్ళినారు. శనివారం ఉదయం 3 గంటలకు అతని తమ్ముడైనా షేర్ల సంతోష్ వేకువ జామున లేచి అతని ఇంటి తలపులు చూడగా డోర్ తాళం పగలగొట్టబడి వున్నది.

విషయం సోదరుడికి తెలుపగ వెంటనే షేర్ల రవి తన ఇంటికి వచ్చి చూడగా బీరువాలో వున్నా 12 వేల రూపాయలు మరియు 2.5 తులాల బంగారపు అభరణాలు ఎవరో గుర్తు తెలియని దొంగలు రాత్రి సమయంలో ఎవరు లేనిది చూసి అతని ఇంటి తాళం పగలగొట్టి దొంగలించారు.

దొంగలు నాలుగు ఇళ్లలో దొంగతనం చేయడానికి ప్రయత్నిచి ఒక ఇంట్లో మాత్రమే దొంగతనం చేసినారు అని ఏ స్సై తెలిపారు. సర్కిల్ సి ఐ గోవర్ధన్ రెడ్డి, ఏ స్సై శ్రావణి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించి, అక్కడికక్కడే దరఖాస్తు స్వీకరించి కేసు నమోదు చేసారు. నిందితులను గుర్తించి త్వరితగతిన అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏ స్సై పేర్కొన్నారు.

Leave a Reply