జాగృతి జనం బాట

నేడు నర్సంపేటకు కల్వకుంట్ల కవిత

నర్సంపేట నవంబర్ 8 (ఆంధ్రప్రభ): సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్యమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి యూత్ సామాఖ్య‌ రాష్ట్ర కార్యదర్శి తడిగొప్పుల మల్లేశం తెలిపారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 13 వరకు తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నర్సంపేటకు వస్తున్నట్లు ఆంధ్రప్రభకు తెలిపారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం సాధించుకున్న తెలంగాణలో సామాజిక తెలంగాణ ఏర్పడలేదని, సామాజిక తెలంగాణలో సామాజిక వర్గాలకు తీరని అన్యాయం జరుగుతున్న విషయాన్ని తేట తెల్లం చేయడానికి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నర్సంపేటకు వస్తున్నట్లు తెలిపారు. నర్సంపేట పట్టణంలోని అమరవీరులకు నివాళులర్పించి మాదన్నపేట చెరువు కట్టపై సమస్యలపై మాట్లాడనున్నట్లు మల్లేశం పేర్కొన్నారు. జాగృతి జనం బాటలో మేధావులతో సమాలోచన జనంతో మమేకం అవుతూ సామాజిక తెలంగాణ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మల్లేశం వివరించారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడానికి మేధావుల ఆలోచన విధానంతో ముందుకు సాగడానికి జాగృతి జనం బాట ఏర్పాటు చేసినట్లు మల్లేశం స్పష్టం చేశారు.

Leave a Reply