The Palate | ఉచ్ఛిష్ట దోషము

The Palate | ఉచ్ఛిష్ట దోషము
ఉచ్ఛిష్టము అంటే నోటపెట్టుకొని మిగిల్చినది ఎంగిలి. పరుల ఎంగిలి తినడం, తన ఎంగిలిని ఇతరులకు పెట్టడం కూడదని, అది మహా పాపమని పెద్దలు అంటారు. ఇది ఆరోగ్యము, పరిశుభ్రతలకు సంబంధించిన అంశం. నోటిలోని లాలాజలం(Saliva)లో ఉన్న సూక్ష్మ క్రిములు ఒకరి నుండి మరొకరికి వ్యాపించి వివిధ రోగాలను తెచ్చిపెట్టకుండా ఉండాలంటే ఎంగిలి తినరాదు. మనుషులకే కాదు. పశుపక్ష్యాదులకు(For animals and birds) కూడా ఎంగిలి ఆహారం పెట్టరాదు.
The Palate | మన నోటి తుంపరలు చిందకుండా
నోటి తుంపరల ద్వారా జబ్బులు వ్యాపించ కుండా నోటికి ‘మాస్క్’ ధరించాలని వైద్యులు చెబుతు న్నదీ ఇందుకే. పెద్దలతో, గురువులతో సంభాషించేట వంట వండేటప్పుడు, వడ్డించే సమయంలో, భోజనం చేసే వేళలో మన నోటి తుంపరలు(Oral sprays) చిందకుండా జాగ్రత్త పాటించాలని పెద్దలు చెప్పేదీ ఇందుకే.
The Palate | ప్రతి పదార్థమూ ఎంగిలిగానే

ఉత్తమమైన మానవ జన్మనిచ్చి, జీవించడానికి గాలి, నీరు, ఆహారంలాంటి ఎన్నో అమూల్యమైన సౌకర్యాల(Priceless amenities)ని చ్చిన భగవంతునికి సమర్పించడానికి ఎంగిలి కాని పదార్థాన్ని ఎంచుకొందామనుకొంటే అలాంటి పవిత్ర వస్తువేదో కనుగొనడం కష్టమైన పని. పుడిసెడు గంగాజలము(Ganges water) అర్పిద్దామంటే అది జలచరాలచే ఎంగిలి చేయబడింది. పాలను సమర్పిద్దామంటే అవి దూడలచే ఎంగిలి కావింపబడినవి. పూలతో పూజిద్దామంటే అవీ తుమ్మెదలచే ఎంగిలి చేయబడ్డవే. ఇలా సృష్టిలోని ప్రతి పదార్థమూ ఎంగిలిగానే కనిపిస్తుంది.
‘కాదంబరి’ అనే మహాకావ్యాన్ని వ్రాసిన బాణభట్టు యొక్క అద్భుత కవితా కౌశలాన్ని ఆస్వాదించిన ఆనాటి కవి పండిత విమర్శకులు “బాణోచ్ఛిష్టం జగత్ సర్వం” అంటూ ఆయన రచనా వైభవాన్ని ప్రశంసించారట. బాణుని రచన అపూర్వము, అమూల్యము. ఆయన తర్వాతి కవులు ఆయన చూపిన, నడిచిన బాటలో నడవాల్సిన వారే తప్ప కొత్త పుంతలు తొక్కడానికి బాణభట్టు స్పృశింపని ప్రక్రియే లేదు.
The Palate | గుజ్జును పారవేసి తొక్కను నివేదించడం..
అన్ని కవితా ప్రక్రియలనూ ఆయన తన కావ్యములో రుచి చూపించే శాడు. అదే విధంగా సృష్టి లోని ప్రతి పదార్థమూ ఎక్కడో ఒక చోట ఎంగిలి కాబడినదే. శబరి శ్రీరామునికి ఎంగిలి పండ్లు సమర్పించడం, విదురుడు శ్రీకృష్ణునికి అరటి పండు వలిచి గుజ్జును పారవేసి తొక్కను నివేదించడం, వంటి మూల గ్రంథాలో లేని సుప్రసిద్ధ కల్పిత కథలు భగవంతుని పట్ల ఆయా భక్తులు చూపిన భక్తి పారవశ్యాన్ని వర్ణించేవే.
ఆహారం ఎలాంటిదైనా దానిని సమర్పించినవారి మనశ్శుద్ధి ప్రధానం అని చాటిచెప్పే కథలవి.
“ఉచ్ఛిష్ఠం, శివనిర్మాల్యం, వమనం, శవకర్పటం / కాకవి సముత్ప న్నం పంచైతేతి పవిత్రకాః”
ఎంగిలి చేసిన ఆవు పాలు(ఉఛ్చి ష్టం), పరమేశ్వరుని అభిషేకించిన పంచా మృతం మరియు ఇతర పూజా ద్రవ్యములు (శివనిర్మాల్యం), తేనెటీగలు నోటినుండి కక్కిన తేనె (వమనం), పట్టు పురుగు శవాన్ని చుట్టుకొని ఉన్న పట్టు నూలు (శవకర్పటం), కాకిరెట్టలోని గింజల నుండి మొల కెత్తిన రావి చెట్లు (కాకవిష్ఠా సముత్పన్నం)… ఇవి అపవిత్ర ములుగా కన్పించే అత్యంత పవిత్రములైన వస్తువులంటుంది మన ధర్మ శాస్త్రం.
ఉచ్చిష్ట దోషం అంటనివిగా లోకములో ఉన్న మూడు ప్రధాన పదార్థాలు పాలు, తేనె, పండ్లు. దూడలు ఎంగిలి చేసిన పాలు, తేనెటీగల నోళ్ళనుండి స్రవించిన తేనె, చిలుకల వంటి పక్షులు కొరికిన పండ్లు ఎంగిలి దోషము(Tongue defect) అంటని పదార్థాలు. చిన్న పిల్లలు కూడా పండ్లను, ఇతర పదార్థాలను తమ వస్త్రము అడ్డుగా పెట్టి కొరికి ‘కాకి ఎంగిలి, ఫర్వాలేదు అంటూ తింటూ ఉండడం చూస్తూంటాం. కాకులు, చిలుకలు వంటి పక్షులు, చీమలు, ఈగల వంటి కీటకాలు రుచి చూచిన పండ్లను, పదార్థాలను శుభ్రంగా కడిగి తినవచ్చును.
The Palate | నిర్మలమైన మన మనసే
భగవంతునికి సమర్పించడానికి మలినమంటని వస్తు వేది అని ఆలోచిస్తే అది నిర్మలమైన మన మనసే అని తెలుస్తుంది. ఈ సృష్టిలోని సమస్తమూ ఆ దేవుడు సృ ష్టించిందే. అందుకే
“త్వమేవం వస్తు గోవింద!
తుభ్యమేవ సమర్పితం”
‘ఓ స్వామీ! నీవైన వస్తువులను నీకే సమర్పిస్తున్నాను’ అని చెబుతాం.
-డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
