ప|| శ్రీ సంతోషీమాతకూ నిగమగోచరకూ
క్రూర రాక్షస విరోధినికీ కోమలికీ నీరాజనం
అను|| గూఢాత్మికకూ క్రోధ వర్ణితకూ
అనంతరూపిణీకీ గౌరీసావిత్రికీ నీరాజనం
చ|| ప్రియ భాషిణీకీ ప్రీతిదాయినీ
ధీమతీ ధర్మనిలయా ముక్తాహార విభూషితా
మహిమాన్వితాకూ బంధన ధ్వంసినీ
భైరవికీ శ్రీ సంతోషిమాతకూ నీరాజనం