• ఘటన మూడు రోజుల తర్వాత వెలుగులోకి
  • పోలీసుల వద్ద లొంగిపోయిన భార్య


కర్నూలు బ్యూరో, ఆగస్టు 25, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా (Kurnool District) లో దారుణం చోటుచేసుకుంది. మద్దికెర మండలం ఎం.అగ్రహారంలో భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. అయితే ఈ ఘటన హత్య జరిగిన మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి. మద్దికెర మండలం (Maddikera Mandal), ఎం.అగ్రహారంకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని భార్య సరస్వతి మూడు రోజుల క్రితం హత్య చేసింది.

ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది. అక్కడి నుంచి పరారైంది.. కానీ, ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసుల (Police)కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులను పగలగొట్టి చూస్తే.. వెంకటేష్ మృతదేహం కనిపించింది. కాగా, ఆస్తి కోసమే భర్తను సరస్వతి హత్య చేసిందని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. మరోవైపు వెంకటేష్ భార్య సరస్వతి (Saraswathi) పోలీసుల ముందు లొంగిపోయింది… భర్త తనను తరచూ వేధించడం వల్లే హత్య చేసినట్లుగా పోలీసుల వద్ద ఒప్పుకున్నట్లు సమాచారం.

Leave a Reply