ఘనంగా శివపార్వతుల శాంతి కళ్యాణం..

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ శివనగర్లో కన్నుల పండుగగా శ్రీ శివపార్వతుల శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో శివపార్వతుల శాంతి కళ్యాణం వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య కన్నుల పండుగ నిర్వహించారు. డివిజన్ నుండి భారీగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం స్వీకరించి పునీతులయ్యారు. కళ్యాణమనంతరం మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

కార్యక్రమంలో భవన సమితి అధ్యక్షుడు వడ్నాల మల్లయ్య, కన్వీనర్ వడ్నాల సదానందం , ప్రధాన కార్యదర్శి బూదారపు భాస్కర్, కోశాధికారి పాశికంటి రవికుమార్, పరపతి సంఘం కార్యవర్గ సభ్యులు, చామంతుల బిక్షపతి, పాశి కంటి రాజేశ్వరరావు,ఊరుగొండ సారంగపాణి తౌటం మధు, బైరి శ్యాంసుందర్, కూచన రాజేశ్వరరావు రా పెళ్లి చంద్రమౌళి, చిదురాల రాజలింగం, వైట్ల కుమారస్వామి, దాసి సురేందర్, మిట్టపల్లి కోటేశ్వర్, బత్తుల సత్యం, కోడం సుధాకర్, కస్తూరి శ్రీనివాస్, రాగుల శ్యాంసుందర్, పులిపాటి భాస్కర్, పూజారులు అభిషేక్ శర్మ, ధనుష్ శర్మ, కృష్ణ శర్మ, ఇతర కార్యవర్గ సభ్యులు, భక్తులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply