గ్రామ అభివృద్ధి ధ్యేయం..

  • సర్పంచ్ అభ్యర్థి దుర్వా గీత

గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : ముత్తునూరు గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి దుర్వా గీత అన్నారు. ఆదివారం గ్రామంలో ఆమె మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పాఠశాలలు, గ్రామంలో ఉపాధి అవకాశాల కల్పన వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పారదర్శకంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా తనకు కేటాయించిన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ముత్తునూరు గ్రామ ప్రజలను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply