- 24 గంటలు అందుబాటులో ఉంటాం
- బాధ్యతలు స్వీకరించిన రాయుడు
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్. సుబ్బారాయుడు(Subbarayudu) ఆదివారం బాధ్యతల స్వీకరించారు. మొదట శ్రీవారిని దర్శించుకుని ఆపై ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్య(Democrat) పరి రక్షణే పోలీసుల ధ్యేయమని, 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లా ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో(at the police station) ఫిర్యాదు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా(strictly) ఉంటామన్నారు. విజిబుల్ పోలీసింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాల నుండే కాకుండా ప్రపంచంలోని(n the world) అన్ని దేశాల నుండి శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందన్నారు. బాధ్యతలు(responsibilities) స్వీకరించిన సుబ్బారాయుడుకు జిల్లాలోని పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.