- బిజెపి సర్పంచ్ అభ్యర్థి రేణుక భరత్
- బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్
ఊట్కూర్, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వ ఎంపీ నిధులను ఉపయోగించి ఊట్కూర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్, బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రేణుక భరత్ తెలిపారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అవినీతి రహిత పాలనే బిజెపి లక్ష్యం అని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించామని, గ్రామ రూపురేఖలు మార్చే అవకాశం ఇచ్చి అభివృద్ధికి దారితీస్తామని తెలిపారు. ఎంపీ డీకే అరుణ ప్రత్యేక కృషి చేసి అధిక నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని, ఆదరించి ఓటు వేస్తే అభివృద్ధి చేస్తామని రేణుక భరత్ అన్నారు. ఆయన సర్పంచ్ హయాంలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించిన ఘనతను పంచుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం తమ పార్టీ ఘనత అని తెలిపారు. సర్పంచ్‌గా గెలిచినప్పుడు గ్రామంలో త్రాగునీరు, విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.
రేణుక భరత్ నిరంతరం ప్రజాసేవలో ముందుండి సమస్యలను పరిష్కరిస్తారని, సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలను ప్రతి కాలనీలో ఏర్పాటు చేస్తామని, 16 వార్డులలో పార్టీలకతీతంగా అభివృద్ధి చేపట్టతామని చెప్పారు.
కార్యక్రమంలో బిజెపి నాయకులు కృష్ణయ్య గౌడ్, ఎం. విజయ్ కుమార్, కొండన్ గోపాల్, రమేష్, హన్మంతు, కుర్వ ఆశప్ప, లక్ష్మణ్, భరత్, రమేష్, రణవీర్ తదితరులు పాల్గొన్నారు.

