నంద్యాల బ్యూరో, జులై 22 ఆంధ్రప్రభ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) మంగళవారం నంద్యాల (Nandyala) కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ (Minister NMD Farooq), పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి (Gowru Charitha Reddy), టీడీపీ నాయకుడు గౌరు వెంకట్ రెడ్డి (Gowru Venkat Reddy), నాయకులు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పాణ్యం నియోజకవర్గంలోని దుర్వేసి గ్రామానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యురాలు గౌరు చరిత రెడ్డితో కలిసి దుర్వేసి గ్రామంలో పర్యటించారు.
గడివేముల మండలం (Gadivemula Mandal) దుర్వేసి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, సూపర్ సిక్స్ పథకాల లబ్ధిదారులతో మంత్రి ఆనం, ఎమ్మెల్యే గౌరు చరిత, స్థానిక ప్రజాప్రతినిధులతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ప్రజల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాణ్యం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం జరుగుతుంది.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా స్థానికంగా ఉన్న మంత్రులు రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్, హాస్టల్ రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, తో పాటు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నందికొట్కూరు నియోజకవర్గం లో స్థానిక శాసనసభ్యులు గిత్త జయసుధతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో శాసన సభ్యురాలు భూమా అఖిలప్రియ తో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడం విశేషం.