మంటలు అదుపులోకి రాక

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదానికి ప్రధానంగా తెలుస్తున్న కారణాలు.
ఫైర్ సేఫ్టీ కిట్ తో కాకుండా నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం లేకపోయింది.
మంటలు తీవ్రతను డ్రైవర్లు అంచనా వేయలేకపోవడం వల్ల వేగంగా మంటలు వ్యాపించాయి.
ప్రమాదం తర్వాత ప్రయాణికుల్ని ఆలస్యంగా నిద్ర లేపడం వల్ల ఎక్కువమంది ప్రాణాలు కాపాడలేకపోయారు.
ప్రమాదం వల్ల బస్ హైడ్రాలిక్ సిస్టం దెబ్బతినడంతో డోర్లు బస్సు డోర్ ఓపెన్ కాకపోవడంతో బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో ప్రయాణికులు మంటలకు ఆహుతయ్యారు.
అందులో చాలామంది ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి బయటకు రాలేకపోయారు.
బస్సులో నడిచే మార్గం ఇరుగ్గా ఉండడంతో ఎమెర్జెన్సీ డోర్ వద్దకు చేరుకోవడానికి, నిద్రలో ఎటుపోవాలో తెలియక తీవ్రంగా ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలుకాపాడుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతొ తీవ్ర ప్రాణనష్టం సంభవించింది.
ఏసి స్లీపర్ ను కమ్మేసిన దట్టమైన పొగతో ఊపిరి అందని పరిస్థితి తలెత్తింది.
బైక్లు స్లీపర్ బస్సు ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు అదుపులోకి రాక బస్సు మొత్తాన్ని ఆక్రమించి తీవ్ర విషాదాన్ని నింపాయి.

Leave a Reply