చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు పూర్తిస్తాయి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు ఉదయం పట్టణంలోని 6వ, 12వ వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు పంపులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి నీరందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ADB | తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కరిస్తా.. ఎమ్మెల్యే వివేక్
