sarpanch| సరిలేరు నీకెవ్వరూ..

sarpanch| సరిలేరు నీకెవ్వరూ..
- అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణాను అడ్డగింత
- ఆమె ధైర్య సాహాసాలకు ప్రశంసలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : అబల అనగానే అందరికీ అలుసే.. కానీ వారిలో కూడా వీరనారీమణులు ఉన్నారని నిరూపిస్తున్నారు కొందరు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, అన్ని రంగాల్లోనూ రాణిస్తామని రుజువు చేస్తున్నారు. ధైర్య సాహాసాల్లోనూ సరిలేరు మాకెవరు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల రూరల్ పరిధిలోని నాగారం గ్రామ సర్పంచ్ స్వప్న నిరూపించారు. ఆమె డేరింగ్ డాషింగ్‌కు స్థానికులు శభాష్ అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..
నాగారం గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని గత కొన్ని రోజుల క్రితం పాల్వంచ రెవెన్యూ పోలీస్ అధికారులకు దరఖాస్తు చేసి అక్రమ ఇసుక రాంప్ లో కందకాలు తవ్వించారు. అయినా కూడా ఆగని ఇసుక అక్రమార్కులు బరితెగించి పెద్ద పెద్ద యంత్రాలతో దర్జాగా అక్రమ ఇసుకను రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నాగారం గ్రామ సర్పంచ్ స్వప్నకు తెలిసింది. దీంతో స్థానికులతో కలిసి వెళ్లి అక్రమ ఇసుక రవాణా జరగకుండా భారీ యంత్రాలను అడ్డుకున్నారు. ఆమె ధైర్యాన్ని చూసి స్థానికులు శభాష్ సర్పంచ్ స్వప్న అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
