- కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
- గ్రామాల్లో ప్రచారంలో
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
శనివారం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని కమలాపూర్, తిమ్మాపూర్, రాయపట్నం, దొంతపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించి, కార్నర్ మీటింగ్‌లలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కమలాపూర్ అభ్యర్థి కుమ్మరి రవి, తిమ్మాపూర్ అభ్యర్థి వావిలాల మమత జగదీష్, రామ్ దేని మొగిలి లను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
అభ్యర్థులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు తన ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి అని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని, ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామని, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలందరికీ చేరే విధంగా చూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు పూర్తయి ప్రజలు గృహప్రవేశం చేసారని, మిగతా హామీలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుతామని తెలిపారు.

