ఉప్పల్ స్టేడియం కాంప్లిమెంటరీ టిక్కెట్ల విషయంలో.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) – సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఫ్రాంచైజీ మధ్య తలెత్తిన వివాదం పరిష్కారమైంది.
ఇరువైపుల ప్రతినిధులు సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ షణ్ముగంతో టెలిఫోన్‌లో మాట్లాడారు. టిక్కెట్ల కేటాయింపు యథావిధిగా కొనసాగుతుందని సీఈఓ షణ్ముగం హామీ ఇచ్చారు.
గతంలో లాగే అన్ని కేటగిరీల్లోనూ పాస్‌లు కావాలని హెచ్‌సీఏ కోరగా.. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏ కి 10 శాతం టిక్కెట్లను కేటాయిస్తామని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పష్టం చేసింది. దీంతో హెచ్‌సీఏ– ఎస్ఆర్‌హెచ్ మధ్య టికెట్ వివాదానికి తెరపడినట్లైంది.