Pulivendula |పులివెందులకు రూపాయి కూడా ఇవ్వని సీఎం

Pulivendula | పులివెందులకు రూపాయి కూడా ఇవ్వని సీఎం

  • కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మాజీ సీఎం దే
  • మున్సిపల్ చైర్మెన్ వరప్రసాద్

Pulivendula | పులివెందుల అర్బన్, ఆంధ్రప్రభ : పులివెందుల మున్సిపాలిటీకి సీఎం చంద్రబాబు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని, పులివెందుల మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని, మున్సిపాలిటీలోని సామాన్యప్రజలపై భారం లేకుండా చూడాలని.. పన్నులను పెంచి ఇబ్బందులకు గురిచేయవద్దని, మున్సిపాలిటీకి సకాలంలో పన్నులు చెల్లించాలని, మున్సిపల్ చైర్మెన్ వరప్రసాద్ పేర్కొన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ లోమున్సిపల్ కమీషనర్ రాముడు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వంచారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ వరప్రసాద్ తో పాటు మున్సిపల్ వైసీపీ ఇన్చార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ హాఫిజ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ ఐ ఎజెండా చదివి వినిపించారు. అనంతరం మున్సిపల్ చైర్మెన్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఆధాయం పెరిగే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సకాలంలో ఇంటిపన్నులు, నీటి పనులు, ఇతర పన్నులను చెల్లించే విధంగ చూడాలన్నారు. సామాన్య ప్రజలపై భారంలేకుండా చూడాలన్నారు. అమాంతంగా ఇన్నుపన్నులు 33శాతం జీఎస్టీ తగ్గిస్తామని చెప్పి పెంచితే ఇబ్బందులు పడుతారన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మున్సిపల్ అధికారులు వార్డుల్లో సమస్యలు ఉంటే ఆవార్డులోని కౌన్సిలర్కు తెలియజేయలన్నారు. యూజీడీ సమస్యలు లేకుండా చూడాలన్నారు.

పగిలిపోయిన యూజీడీ మూతలను ఏర్పాటు చేయాలన్నారు. వీధిలైట్ల నిర్వహణ చేపట్టాలన్నారు. మంచినీటి సమస్యతలెత్తకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పులివెందుల పట్టణంలో మూడు రోడ్లు కమిటీ భవనానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిల చోరువతో పులివెందుల మున్సిపాలిటీకి ఎంపీల నిధుల కింద రూ. రెండున్నర కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. అలాగే పులివెందుల మున్సిపాలిటీలో 1985 సంవత్సరం నుంచి అనధికార ప్లాట్లను రెగ్యులర్ చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అనధికార ప్లాట్లు క్రమబద్ధీకరణ చేసేందుకు ఇప్పటికే 125 దరఖాస్తులు వచ్చాయని, దానివల్ల మున్సిపాలిటీకి దాదాపు కోటి రూపాయలు ఆదాయం లభించిందన్నారు.

ఇంకనూ రెగ్యులరేషన్ చేసుకొని ప్రజలు రెగ్యులర్ చేసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. గతంలో రెండుసార్లు మున్సిపాలిటీకి అవార్డులు రావడం జరిగిందన్నారు. జగనన్న కాలనీ కి సంబంధించిన లబ్ధిదారులు కట్టిన రూ. 35 వేలు డబ్బులు మున్సిపాలిటీలోనే ఉన్నాయని ఎవరు అపోహ పడవద్దని ఆయన అన్నారు. లబ్ధిదారులు కట్టిన డబ్బులు మున్సిపాలిటీలో రూ. 9 కోట్ల 58 లక్షలు మున్సిపల్ అకౌంట్ లో ఉన్నాయన్నారు. ఈ సారి కూడా మున్సిపాలిటీకి అవార్డు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మూలిమహేశ్వర్ రెడ్డి బ్రాహ్మణపల్లె గ్రామంలో స్మశానం వెళ్లే రహదారిలో నాలుగు కరెంటు స్తంభాలు రోడ్డులో అడ్డంగా ఉన్నాయని వాటిని తొలగించి పక్కకు వేయాలని కోరారు.

హౌసింగ్ లో గత ప్రభుత్వంలో ఎనిమిది వేల ఇండ్లు లబ్ధిదారులకు ఇచ్చారని చెప్పడం జరిగిందని కానీ ఇప్పుడు హౌసింగ్ అధికారులు రూ. 6వేలకు మాత్రమే శాంక్షన్ అయ్యా అనడం ఏమిటని, మిగతా ఇల్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. వెంటనే చైర్మన్ వరప్రసాద్ సంబంధిత అధికారికి సిఫారసు చేసి వెంటనే కరెంటు స్తంభాలు పక్కకు మార్చాలని తెలిపారు. హౌసింగ్ అధికారి మాట్లాడుతూ 8000 ఇల్లు శాంక్షన్ కావడం వాస్తవమేనని, అందులో మరణించిన వారివి ఊర్లో లేని వారివి, గతంలో ఇండ్లు తీసుకున్న వారివి ఫోను మిగిలిన వారికి ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. కో ఆప్షన్ నెంబర్ దాసరి చంద్రమౌళి పులివెందుల పట్టణంలో గత ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన బస్సు షెల్టర్లలో కరెంటు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, గతంలో వెలుగుతున్న లైట్లు ఇప్పుడు ఎందుకు వెలగడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. వెంటనే చైర్మన్ స్పందిస్తూ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి లైట్లు వెళ్లకుండా పోవడానికి కారణాలు తెలుసుకొని త్వరితగతిన సమస్యను పరిష్కరింప చేస్తామన్నారు. ఇంకా వార్డులలో ఏవైనా సమస్యలు నెలకొని ఉంటే వెంటనే కౌన్సిలర్లు దృష్టికి తీసుకొస్తే, వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యల పరిష్కరింప చేస్తారన్నారు. అధికారులు కౌన్సిలర్లకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply