బాలుడు ఆత్మహత్య

బాలుడు ఆత్మహత్య

ఎమ్మిగనూరు టౌన్‌, ఆంధ్రప్రభ : సెల్‌ఫోన్‌ ఇవ్వలేదని మనస్తాపంతో ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోని వెంకటాపురానికి చెందిన శేఖర్ దంపతుల కుమారుడు పవన్‌ (12) ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటున్నాడు. ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్‌పై అతడి మోజు పెరిగిందని గమనించిన తల్లిదండ్రులు, పవన్‌ను మందలించి అతడి నుంచి ఫోన్‌ను తీసుకున్నారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply