ENG vs AUS | టాపార్డర్ డమాల్.. ఎదురీదుతున్న ఆసీస్ !
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ఎదురీదుతొంది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 352 పరుగుల రికార్డు స్కోరును ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన కంగారూలకు మరో షాక్ తగిలింది.
ఆదిలోనే విద్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (5) ల రూపంలో ఆసీస్ జట్టు కీలక వికెట్లు కోల్పోగా… ఈ క్రమంలో ఓపెనర్ మాథ్యూ షార్ట్, మార్నస్ లాబుషాగ్నే జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. జట్టుకు కీలకంగా మారుతున్న మాథ్యూ షార్ట్ – మార్నస్ లాబుషాగ్నేలను పెవిలియన్ చేర్చారు ఇంగ్లండ్ బౌలర్లు.
మాథ్యూ షార్ట్ (63) 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్ధ సెంచరీతో విజృంభించాడు. మరోవైపు మార్నస్ లాబుషాగ్నే (47) తృటిలో అర్ధ సెంచరీని కోల్పోయాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. అయితే, 19.2వ ఓవర్లో ఆదిల్ రషీద్ వేసిన బంతికి మార్నస్ లాబుస్‌చాగ్నే ఔటవ్వగా.. 22.2 వ ఓవర్లో లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్ లో మాథ్యూ షార్ట్ పెవిలియన్ చేరాడు.
ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ (29 బంతుల్లో 34), అలెక్స్ కారీ (17 బంతుల్లో 20) ఉన్నారు. 28 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోర్ 184/4.