గ్రామ సమగ్రాభివృద్ధే సర్పంచ్‌ల ధ్యేయం

తిర్యాణి, ఆంధ్రప్రభ: నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామాల సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు జువ్వాజీ అనిల్ గౌడ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన గోపెర్, నాగుగూడ సర్పంచ్ పేంద్ర దేవ్ బాయి, కౌటగాం సర్పంచ్ కాట్లే మంజుల, ఉపసర్పంచ్ పంద్రం వాణిశ్రీ సర్పంచ్‌లకు జువ్వాజీ అనిల్ గౌడ్ శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.

జువ్వాజీ అనిల్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు ఎన్నో ఆశలతో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని, ఆ నమ్మకాన్ని వ్యర్ధం చేయకుండా కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లోని మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ చేరవేయడంలో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామ వికాసంలో పాలుపంచుకుని ఆదర్శవంతమైన పాలన అందించి ప్రజల మనసు గెలవాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆత్రం తెలంగాణరావు, పంద్రం నాగేష్, తిర్యాణి సర్పంచ్ మడవి రాజేష్, మందగూడ సర్పంచ్ తుమ్మరం గోపాల్, పెందోర్ కాశిరాం, చిక్రం సోమేశ్, కాట్లే మధుకర్, వల్క రామచందర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply