అందుకే జనం బేజారు
శ్రీకాళహస్తి, ఆంధ్రప్రభ : శ్రీకాళహస్తి అది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. పైగా పట్టణం. జనవాసాల(inhabited) కీలక ప్రాంతం శ్రీరామ నగర్ కాలనీ, పానగల్ ప్రాంతంలోని జన చైతన్య ఫ్లాట్స్ అదొక మందుబాబుల(drugs) విడిది కేంద్రంగా మారింది.
చుక్క చుక్క గుటకేస్తూ గంటల తరబడి కాలాక్షేపం చేస్తుంటారు. రోడ్డు పక్కనే చెట్ల కింద కూర్చుని మద్యం సేవించే ఈ మద్యం బృందాలను .. మధ్య మధ్యలో కేకలు, రంకెలు వేస్తుంటే.. అటుగా వెళ్లే జనం బిక్కుబిక్కుమనాల్సిందే.
అక్కడ ఎన్నోఇళ్లు ఉన్నాయి. ఈ రోడ్డులో రైల్వే ట్రాక్(railway tracks) దాటుకుని పెంకులపాడు, నారాయణపురం, విశాల లక్ష్మీ నగర్(Visala Lakshmi Nagar) కాలనీలకు జనం ఈ మందుబాబుల వీరంగాన్నిభరించాల్సిందే.
ఒకరిద్దరు ఈ దారిలో వెళ్లాలంటే భయం భయంగా పోవాల్సిందే, కారణం మందుబాబులు పట్టణంలో మద్యం కొనుగోలు చేసుకుని ఇక్కడ తాగుతుండడంతో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు తెలియని పరిస్థితి.
ప్రతిరోజు(every day) పట్టణ పోలీసులు గస్తి ఏర్పాటు చేస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నాఏమాత్రం భయపడకుండా(Without fear of people) మందుబాబులు విచ్చలవిడిగా చెట్ల కింద కూర్చొని గంటల తరబడి మందు సేవిస్తూ మత్తు ఎక్కువైతే అరుపులు, కేకలు వేస్తున్నారు.
గొడవలకు దిగుతున్నారు. ఉదయం సాయంత్రం స్థానికులు చల్లటి వాతావరణంలో వాకింగ్‌కు వెళుతుంటారు. సాయంత్రం(in the evening) అవుతున్నాగంటల తరబడి మందుబాబులు ఇక్కడే తిష్ట వేయడంతో అటు వాకింగ్‌కి వెళ్ళాలంటేనే స్థానిక మహిళలు భయపడుతున్నారు. ఇకనైనా పోలీసు అధికారులు ఈ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.