EARTH| అందుకే.. భూమి పూజ..

EARTH| తణుకు, ఆంధ్రప్రభ : తణుకు నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలు పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇందు కోసం ధవళశ్వరం నుంచి పైపు లైన్లు ద్వారా తాగునీటిని తరలించేందుకు ప్రణాళికలు చేసినట్లు వెల్లడించారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో శుక్రవారం ఈ పథకానికి సంబంధించి భూమి పూజ చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. రూ. 54 కోట్లు వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో మొత్తం 48 గ్రామాలకు ఇంటింటికి తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

దీని ద్వారా 154 కిలోమీటర్ల మేర పైపు లైన్లు నిర్మించడంతో పాటు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అనంతరం దువ్వ గ్రామంలో రూ. 43 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. దువ్వ గ్రామాన్ని స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టి పూర్తి స్థాయిలో గ్రామాన్ని పారిశుధ్య నిర్వహణ చేసే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. దువ్వ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తయారు చేయడానికి ప్రణాళికలు చేశామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం సుమారు రూ. 1650 కోట్లుతో చేపట్టామని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం హామీలను ఇప్పటికే అమలు చేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహకారంతో అనేక సంస్కరణలు తీసుకువచ్చి అన్ని వర్గాలకు సమన్యాయం చేసే విధంగా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply