హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ రాజకీయ వేడి మరింతగా పెరిగింది. శుక్రవారం రహమత్‌నగర్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోరబండలో నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
బీఆర్‌ఎస్‌పై తీవ్రంగా విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గెలిస్తే మంత్రి అజారుద్దీన్, నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ప్రజలకు నిజమైన సేవకులుగా ఉంటారని అన్నారు.
అలాగే, బోరబండను ‘పీజేఆర్ బోరబండ’గా పేరు మార్చి, అక్కడ పీజేఆర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో, ఆయన మైత్రివనం (అమీర్‌పేట్)లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు.

