- టిఫిన్ లో జిల్ల పురుగులు
- ఆనియన్ దోశలో పురుగుల ఫ్రై
- రాఘవేంద్ర హోటల్ నిర్వాహకం
- జరిమానా విధించిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులు
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5(ఆంధ్రప్రభ): ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటల్స్ నిర్వాహకుల బాధ్యతా రాహిత్యం మరోసారి చర్చకు దారితీసింది. తన పిల్లలతో కలిసి టిఫిన్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి దారుణమైన పరిస్థితి ఎదురైంది. వివరాలలోకి వెళ్తే… ఇబ్రహీంపట్నంకు చెందిన హన్మంత్ కుమార్ (పోలీస్ కానిస్టేబుల్ ) శనివారం ఉదయం తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇబ్రహీంపట్నంలోని రాఘవేంద్ర హోటల్ లో టిఫిన్ చేయడానికి వెళ్ళాడు. మూడు ఆనియన్ దోశలు ఆర్డర్ చేశాడు. దోశ తినే క్రమంలో దోశతో పాటు జిల్ల పురుగులు కనిపించాయి.
దోశను కాల్చే సమయంలో జిల్ల పురుగులు సైతం ఫ్రై చేయబడి కనిపించడంతో మున్సిపల్ అధికారులకు పిర్యాదు చేశాడు. మున్సిపల్ అధికారులు రాఘవేంద్ర హోటల్ ను సందర్శించి నాణ్యత లేని ఆహార పదార్థాలను గుర్తించి రూ.2500లు జరిమానా విధించారు. నాణ్యమైన ఆహరం అందించాల్సిన హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.