ఓటర్లకు కృతజ్ఞతలు..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 10 వ వార్డ్ నుండి కాంగ్రెస్ కౌన్సిలర్ గా గెలుపొందిన జెట్ట నీరజా సిద్ధులు బుధవారం తమ వార్డులోని ఓటర్లను కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి వార్డును అందరి సమన్వయ సహకారంతో అభివృద్ధి పరుస్తామని ఆమె చెప్పారు. కౌన్సిలర్ వెంట స్థానిక ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply