TGSRTC | టోల్‌ ఛార్జీల సవరణ… ఆర్టీసీ కొత్త నిర్ణయం !

  • ప్రయాణికులపై అదనపు భారం

ప్రతి ఏడాది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్‌ ప్లాజా పన్నును సవరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కూడా టోల్ ప్లాజా యూజర్ ఛార్జీలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టోల్‌ ప్లాజా యూజర్‌ ఛార్జీని ఆర్టీసీ సవరించింది. టోల్ ప్లాజాలపై ప్రయాణించే ప్రతి బస్సు ప్రయాణికుడి నుంచి అదనంగా రూ.10 వసూలు చేయనున్నట్లు RTC ప్రకటించింది.

ఈ టోల్‌ ప్లాజా యూజర్‌ చార్జీల పెంపు హైదరాబాద్‌ సిటీ రూట్లలో టోల్‌ ప్లాజాలు లేకపోవడంతో ప్రభావం ఉండదని పేర్కొంది. టోల్‌ ప్లాజా మీదుగా వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుంచి అధనంగా రూ.10 వసూలు చేయనున్నట్లు వెెల్లడించింది. టోల్‌ ప్లాజా మీదుగా ప్రయాణించకపోతే ఎలాంటి యూజర్‌ చార్జీ ఉండవని స్పష్టం చేసింది.

విద్యార్థులకు గుడ్ న్యూస్

హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయంలో విద్యార్థుల రద్దీ అధికంగా ఉంటున్న దృష్ట్యా, ఆర్టీసీ విద్యార్థులకు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి అవకాశం కల్పించనుంది.

ఈ సౌకర్యం వల్ల విద్యార్థులు కాలేజీలకు సమయానికి చేరుకునే అవకాశం లభిస్తుందని, RTC నిర్ణయం ప్రజల మద్దతును పొందుతోంది.

Leave a Reply