TGPSC | గ్రూప్ 1 అభ్య‌ర్ధుల‌కు 16 నుంచి స‌ర్టిఫికెట్స్ వెరిఫికేష‌న్ …

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సెర్టిఫికేట్ల వెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది. అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ను ఈ నెల 16, 17, 19, 21వ తేదీల్లో నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో ధృవపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఉంటుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు రావాలని కమిషన్ సూచించింది.

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి స్రీనింగ్‌ టెస్ట్‌

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింద. సాంకేతిక విద్య అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి స్క్రీనింగ్‌ టెస్ట్‌(రాత పరీక్ష) నిర్వహించాలనిప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్‌డీ అర్హత గల వారికి 10, ఈ అర్హత లేని వారికి 20 మా ర్కుల పరీక్ష నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జీవో-21 జారీ చేసింది. ఇంజినీరింగ్‌యేతర కోర్సుల అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రాత పరీక్ష లేకపోగా, ఇంజినీరింగ్‌ కోర్సులు బోధించే వారికి మాత్రం రాత పరీక్ష నిర్వ హించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇంజనీరింగ్‌ కోర్సులు బోధించడానికి మొదట్లో బీటెక్‌ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించగా.. ఆ తర్వాత ఎంటెక్‌ చేసిన వారికి కూడా అవకాశం కల్పించారు. ఇప్పుడు స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలంటూ కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. కాగా, ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసిన వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. నెట్‌, సెట్‌ అర్హత గల వారు కూడా అరుదుగా ఉండటంతో స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *