హైదరాబాద్ – హీమోఫిలియాతో బాధపడుతున్న విద్యార్థులకు హీమోఫిలియా హైదరాబాద్ సోసైటీ బాసటగా నిలిచింది. త్వరలో జరుగబోయే పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే హీమోఫిలియా బాధిత 12మంది విద్యార్థులకు 3లక్షల విలువైన ఫ్యాక్టర్ ఇంజిక్షన్‌ను ఉచితంగా పంపిణీ చేశారు.
పంజాగుట్టలోని హీమోఫిలియా సోసైటీ కార్యాలయంలో ఒక్కొక్కరికి 24వేల రూపాయల విలువైన ఫ్యాక్టర్ ఇంజిక్షన్లను అధ్యక్ష, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రావు, అబ్దుల్ రజాక్ హీమోఫిలియా బాధిత విద్యార్థులకు అందజేశారు.
పరీక్షలకు హాజయరయ్యే సమయంలో వ్యాధిగ్రస్తులకు శరీరంలో అంతర్గత రక్తస్రావం జరుగకుండా ముందస్తుగా ఇంజక్షను తీసుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలను విజయవంతంగా ముగించి ఉన్నత చదువులు అభ్యసించాలన్నారు.
హీమోఫిలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో బాధిత విద్యార్థులకు ఉచిత ఫ్యాక్టర్ మందులను అందజేసినట్లు చంద్రశేఖర్‌రావు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇంకా సోసైటీ జాయింట్ సెక్రటరీ వంశీ, కోశాధికారి కుమార్, మహిళా ప్రతినిధి సుజాత తదితరులు పాల్గొన్నారు.