గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జివన్ రామ్

గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జివన్ రామ్
సర్పంచ్ కాటం వెంకటేశం
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉప ప్రధాన మంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా చిట్యాల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులు, పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సర్పంచ్ కాటం వెంకటేష్ మాట్లాడుతూ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో అణగారిని వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు పంచాయతీ సెక్రెటరీ కంచర్ల గౌతంరెడ్డి, వార్డ్ సభ్యులు కురు యాదయ్య, జిల్లా ప్రశాంత్ ఏర్పుల మల్లేశ్వరి కందిమల్ల జోగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
