TG | ఇసుక లారీ డ్రైవర్ అజాగ్రత్త..

TG | ఇసుక లారీ డ్రైవర్ అజాగ్రత్త..
టీజీ ఎస్ ఆర్ టి సి బస్ డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం…
ప్రయాణికులు సురక్షితం….
TG | శంకరపట్నం, ఆంధ్రప్రభ : ఓ ఇసుక లారీ డ్రైవర్ అజాగ్రత్తగా జాతీయ రహదారిపై లారీ నడపగ, ఓ లారీని, ఢీకొట్టడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు శనివారం తెలిపారు.
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో మూలమలుపు వద్ద జాతీయ రహదారిపై ఓ ఇసుక లారీ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీరవంక మండలం పోతిరెడ్డి పల్లె నుండి ఇసుక లోడ్ చేసుకున సిద్దిపేటకు వెళుతుండగా, మార్గమధ్యంలోని తాడికల్ గ్రామ శివారులో మూల మలుపు వద్ద ఇసుక లారీ డ్రైవర్ సురేష్ లారీని అజాగ్రత్తగా నడుపుతూ రోడ్డుపై వెళ్లి కరీంనగర్ నుండి, యూరియా లోడ్ చేసుకొని తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం పరిధిలోని కరీంపేట గ్రామానికి యూరియా లోటుతో వెళుతున్న లారీని ఢీకొట్టడంతో యూరియా లారీ వెనుక భాగం నుజ్జున అయిందని, హుజురాబాద్ డిపోకు చెందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు కరీంనగర్ నుండి హుజురాబాద్ వైపుకు వస్తుండగా, దాన్ని గమనించిన బస్సు డ్రైవర్ శ్రీకాంత్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును అదుపు చేసి రోడ్డు దించడంతో, అందులో ప్రయాణిస్తున్న 70 మందిలో ముగ్గురికి స్వల్ప గాయాలు ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. నిర్లక్ష్యంగా ఇసుక లారీ నడిపి ప్రమాదానికి కారణమైన ఇసుక లారీ డ్రైవర్ సురేష్ పై చట్టపరంగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బస్సులోని ప్రయాణికులు కోరుతన్నారు.

