TG – ఫిరాయింపుదారులపై అనర్హత వేటుకు ఎంత సమయం కావాలి? – సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటీషపన్ పై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ జార్టి మైస్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని గతేడాది మార్చిలో చెప్పినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశీకరెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతీ కోర్టుకు తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్యేలకు స్పీకర్ తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తుచేశారు. ఎంత సమయం కావాలో స్పీకర్‌ను కనుక్కొని చెప్పాలని ముకుల్ రోహత్లీకి జస్టిస్ బీఆర్ గవాయ్స్ ధర్మాసనం సూచించింది. అనంతరం తదుపరి విచారణను వారం రోజులకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఫిరాయింపులపై రెండు పిటీషన్లు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 16న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు లో రెండు పిటిషన్లను దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ తగిన సమయం ఇవ్వాలంటూ కోర్టు ను అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? అంటూ ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే దాకా.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు ప్రభుత్వం తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. శాసనసభ స్పీకర్ ను అడిగి నిర్ణయాన్ని కోర్టుకు విన్నవిస్తామని బదులిచ్చారు.