TG | వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంపు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యార్థులకు శుభవార్త అందించింది. వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ను 15 శాతం పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుదల వైద్య, దంత విద్యార్థులకు వర్తిస్తుంది. అలాగే, సీనియర్ రెసిడెంట్ వైద్యులకు గౌరవ వేతనాన్ని కూడా ప్రభుత్వం పెంచింది.

స్టైఫండ్ వివరాలు..

ఇంటర్న్స్‌ – నెలకు రూ. 29,792
పీజీ ఫస్ట్ ఇయర్ – రూ. 67,032
పీజీ సెకండ్ ఇయర్ – రూ. 70,757
పీజీ ఫైనల్ ఇయర్ – రూ. 74,782

ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు ఊరట కలిగించనుందని వైద్య విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply