జపాన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రతినిధులు స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ నెల 16 నుంచి ఏడు రోజుల పాటు జపాన్ దేశంలో పర్యటించింది. ఈ పర్యటనలో రాష్ట్రానికి రూ.12,062 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. పలు రంగాల్లో సహకారం, సాంకేతిక భాగస్వామ్యం కోసం చర్చలు జరిపింది.