గోదావరిఖని, ఆంధ్రప్రభ : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంగళ వారం అర్థరాత్రి పెద్దపల్లి జిల్లాలోని రామగుండం రైల్వే స్టేషన్, గోదావరి ఖని బస్ స్టాండ్, రామగుండం పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.
రామగుండం పోలీస్ కమీషనర్ గా బాధ్యత లు స్వీకరించిన అనంతరం అర్ధరాత్రి వేళ గోదావరిఖని, రామగుండం ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లలో ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం రామగుండం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడీ బుక్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు.
