హైదరాబాద్: మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి శాంతి చర్చల కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంను కోరారు. ఈ మేరకు శాంతిచర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ సీఎంకు వినతిపత్ర అందజేశారు
దీనిపై స్పందించిన సీఎంరేవంత్రెడ్డి.. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందన్నారు. శాంతి భద్రతల అంశంగా పరిగణించదని చెప్పారు.
గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉంది.. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటాం.. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు
సిఎం ను కలిసిన శాంతి చర్చల కమిటీ లో కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ ఉన్నారు
ముఖ్యమంత్రి ని కోరారు శాంతి చర్చల కమిటీ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు .
!
శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..