TG | ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు – నీలం మధు

చిట్కుల్ – పేదల ఆరోగ్య పరిరక్షణకు గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు మేలు జరుగుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం చిట్కుల్ గ్రామంలో నీలం మధు సహకారంతో ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ – మెడీ స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ గ్రామాలలో సామాన్యులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు.

ప్రస్తుతం కాలుష్యం, రసాయనాలతో పంటల్ని పండించడం, కలుషిత ఆహారం తీసుకోవడం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం వలన అనేక వ్యాధుల బెడద పెరిగిందన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా తమ రోగాన్ని తెలుసుకుంటే తగిన చికిత్స తీసుకోవడానికి ఆస్కారం దొరుకుతుందని, దీంతో వ్యాధి ప్రారంభంలోనే స్వల్ప కాలిక చికిత్సలతో నయం చేసుకోవచ్చన్నారు. అయితే ప్రజలలో వ్యాధుల పట్ల అవగాహన లోపం తో పాటు పేదరికం వలన చాలా మంది వ్యాధి నిర్ధారణ పరీక్షలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు.

దీంతో వ్యాధులు ముదరడంతో తీవ్ర అనారోగ్యనికి గురయ్యే అవకాశం ఉందని, కొన్ని సందర్భలలో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కోసం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు తప్పనిసరిన్నారు. వైద్య శిబిరాల్లో ఏర్పాటు చేసే రోగ నిర్ధారణ పరీక్షలతో వ్యాధిని తెలుకుని అందుకు తగిన చికిత్స చేస్తారని స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనర్తం ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపు ను ప్రతి ఒక్కరూ విరివిగా వినియోగించుకోవాలని సూచించారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మెగా మెడికల్ క్యాంపు ను ఏర్పాటు చేసిన ప్రైవేట్ టీవీ ఛానల్- మెడిస్టార్ హాస్పిటల్ వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మెడి స్టార్ హాస్పిటల్ ఎండి Dr కిరణ్,మేనేజింగ్ డైరెక్టర్ Dr లత,డాక్టర్లు రాష్మిక, శివ మోహన్ రెడ్డి,సంతోష్, ప్రకాశ్,కాంగ్రెస్ నాయకులు పొట్టి నారాయణరెడ్డి, వి నారాయణ రెడ్డి, చాకలి వెంకటేష్ , వల్లేపు వెంకటేష్, సుంకరి బుజ్జి, గౌరీ శంకర్, అనిల్, శ్రీను,మెడికల్ క్యాంపు నిర్వాహకులు, డాక్టర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *