హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలలో బిజెపి అభ్యర్ధులు , ఒక స్థానంలో పిఆర్ టి యు అభ్యర్థి గెలుపొందారు.. ఈ ఎన్నికలు కాంగ్రెస్ ,బిజెపి మధ్య జరగడం విశేషం.. బీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది.. ఈ నేపథ్యంలో నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పిఆర్ టియు అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎర్రవల్లి నివాసంలో బిఆర్ ఎస్ అధినేతను కేసీఆర్‌ను కలిశారు. ఆయనకు పూలమొక్క ఇచ్చి అశీర్వాదం తీసుకున్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన శ్రీపాల్ రెడ్డిని అభినందించారు.. ఉపాధ్యాయులు ఎంతో ఆశతో గెలిపించారని , వారి సమస్యలను పరిష్కరించేందుక నిరంతరం కృషి చేయాలని శ్రీపార్ రెడ్డికి కెసిఆర్ సూచించారు.. కాగా… నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, రేవంత్ సన్నిహితుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.