- సీఎం రేవంత్ నేతృత్వంలో ఆగస్ట్ 5న హస్తిన పర్యటన
- బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో ధర్నా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఢిల్లీకి దారి తీసేలా ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది.
సమావేశంలో, కేంద్రం బీసీ బిల్లును పెండింగ్‌లో ఉంచిన అంశాన్ని నిరసిస్తూ, ఆగష్టు 5వ తేదీన ఢిల్లీలో భారీగా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఈ పర్యటనలో: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమైన కేంద్రమంత్రులతో భేటీకి సీఎం శరవేగంగా ప్రయత్నించనున్నారు. అంతేగాక, ఇండియా కూటమి మద్దతును కూడా రిజర్వేషన్ల కోసం కోరనున్నారు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో, బీసీ రిజర్వేషన్ల అంశం పరిష్కారమైన తరువాతే ముందుకెళ్లాలని మంత్రివర్గం ఏకాభిప్రాయానికి వచ్చిందని సమాచారం.