హైదరాబాద్ – అసెంబ్లీలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్ .. అంతకు ముందు జగదీశ్ స్పీకర్ స్థానాన్ని అవమానించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,దుద్దిళ్ల శీధర్ బాబు,సీతక్కలు డిమాండ్ చేశారు. అనంతరం రికార్డ్ లు పరిశీలించిన స్పీకర్ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీశ్ రెడ్డిని సభ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలిచ్చారు.
TG | అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్
