TG | సుప్రీం వ్యాఖ్య‌లు ప్ర‌తి ఒక్క‌రికీ మేల్కొలుపు! – మాజీ ఎంపి సంతోష్ కుమార్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుదామని బీఆర్ఎస్ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాపకులు జె.సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ఎక్స్‌వేదిక‌గా సంతోష్‌కుమార్ ప‌ర్యావ‌ర‌ణంపై ఆస‌క్తిక‌ర‌మైన పోస్టింగ్ పెట్టారు. చెట్లను నరికివేయడం అంటే ఒక వ్యక్తిని చంపడం లాంటిదేనని భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింద‌ని అన్నారు. మ‌న ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌డానికి ఇదో మేల్కొలుపు అని అన్నారు. అటవీ నిర్మూలనకు నో చెప్పి, పచ్చని భవిష్యత్తు కోసం మరిన్ని మొక్క‌ల‌ను నాటడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో చేరాల‌ని పిలునిచ్చారు. ఇప్ప‌టికే గ్రీన్ ఇండియా సంస్థ త‌రుఫున ప‌ర్యావ‌ర‌ణంపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని, చెట్ల‌ను కాపాడుతున్నామ‌ని, మొక్క‌లు నాటిస్తున్నామ‌ని చెప్పారు. గ్రీన్ ఇండియా కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌తి ఒక్క‌రూ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, అలాగే ప‌ర్య‌వరాణాన్ని కాపాడాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *