TG |వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

కౌడిపల్లి ఏప్రిల్ 13 ఆంధ్రప్రభ మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని ఆదివారం రోజు సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు వివరాల్లోకెళ్తే ఆదివారం ఉదయం అల్పాహారంగా విద్యార్థులు ఇడ్లీలు తిన్నారు అల్పాహారం చేసిన 30 మంది విద్యార్థులకు వాంతులు కడుపునొప్పి రావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులకు చికిత్స చేశారు విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆదివారం సాయంత్రం వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా స్టోర్ రూమ్ వాటర్ ట్యాంక్ ఇడ్లీ రవ్వను పరిశీలించారు

ఇడ్లీ రవ్వ శాంపిల్ తీసుకున్నారు విద్యార్థులకు అస్వస్థత ఏర్పడినప్పుడు ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వాలని వార్డెన్ నరసమ్మ పై ఆగ్రహం వ్యక్తపరిచారు సందర్భంగా డిఎంహెచ్వో శ్రీరామ్ విద్యార్థులతో మాట్లాడారు

అనంతరం డిఎంహెచ్వో శ్రీరామ్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని ఇడ్లీ రవ్వను టెస్టింగ్ కోసం పంపించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *